Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

24-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగణన–2027 ఫేజ్–1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (HLO) నిర్వహణకు నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. జనగణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని పేర్కొన్నారు.

ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన పొందాలని, డేటా సేకరణలో పారదర్శకత పాటించాలని సూచించారు. శిక్షణలో బోధించే ప్రతి అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని విధుల్లో అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనగణన–2027 శిక్షణకు శ్రీకారం.ఖచ్చితమైన డేటా సేకరణపై దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

Article Image

జనగణన–2027 ఫేజ్–1లో భాగంగా గృహాల జాబితా, గృహ గణన (HLO) నిర్వహణకు నూతనంగా ఎంపికైన టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమం ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. జనగణన దేశ అభివృద్ధికి కీలకమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని పేర్కొన్నారు.

ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన పొందాలని, డేటా సేకరణలో పారదర్శకత పాటించాలని సూచించారు. శిక్షణలో బోధించే ప్రతి అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని విధుల్లో అమలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News