Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:42 AM

జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

28-03-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగణన-2027ను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన-2027 ఫేజ్–1 గృహాల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకుల (ఫీల్డ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభమయ్యే గృహాల గణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా, సరిగా నమోదు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. గణన ప్రక్రియలో నాణ్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమగ్రంగా, నాణ్యమైన శిక్షణ అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

జనగణన-2027కు కసరత్తు వేగం. పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

Article Image

జనగణన-2027ను పారదర్శకంగా, సమగ్రంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో జనగణన-2027 ఫేజ్–1 గృహాల గణనకు సంబంధించి క్షేత్రస్థాయి శిక్షకుల (ఫీల్డ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 11 నుంచి ప్రారంభమయ్యే గృహాల గణనలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా కచ్చితత్వంతో నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిగా, సరిగా నమోదు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. గణన ప్రక్రియలో నాణ్యత, సమగ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని, ఎన్యూమరేటర్లు మరియు సూపర్వైజర్లకు సమగ్రంగా, నాణ్యమైన శిక్షణ అందించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జనగణన అధికారి వెంకటరమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News