Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

17-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనాభా గణన–2027 ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, చార్జ్ అధికారులు మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు.

మంగళవారం జరిగిన జనాభా గణన–సెన్సెస్ 2027కు సంబంధించిన చార్జ్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, గణనను రెండు దశల్లో సమగ్రంగా చేపట్టాలని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హౌస్ లిస్టింగ్‌ను కచ్చితంగా నిర్వహిస్తే సెన్సెస్ ప్రక్రియ సాఫీగా పూర్తవుతుందని అన్నారు. బ్లాక్ వారీగా ప్రణాళికలు రూపొందించి సులభతరంగా గణన చేపట్టాలని సూచించారు. ప్రతి దశను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

జనాభా గణన–2027లో పాల్గొనే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ సమగ్ర సమాచార సేకరణపై దృష్టి పెట్టాలని అన్నారు. డిజిటల్ విధానంలో జరగనున్న ఈ ప్రక్రియలో ప్రతి ఇంటిని, ప్రతి వ్యక్తిని చేర్చి వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు.

అలాగే, ప్రజల సహకారం కీలకమని పేర్కొంటూ అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చురుకుగా భాగస్వాములను చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గణాంక అధికారి వెంకటరమణ , మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జనాభా గణన–2027 సమర్థవంతంగా నిర్వహించాలి అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News