Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:04 AM

ఇంటర్‌లో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యార్థులకు శుభాకాంక్షలు

15-04-2026 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తెలిపారు.

సోమవారం కళాశాలలో మౌలిక వసతులపై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్‌తో కలిసి ప్రిన్సిపాల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలకు అవసరమైన నిధులు మంజూరు చేయించి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.

తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, గదుల్లో విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, భవనాలు, బెంచీలు, ఫర్నీచర్ తదితర అవసరాల జాబితాను సిద్ధం చేసి అందజేయాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఉచితంగా నాణ్యమైన ఇంటర్మీడియట్ విద్య అందుతుందని, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, ఆధునిక లాబొరేటరీలతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు.

ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో తాటి ఉదయశ్రీ 980/1000, ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ ఎల్ఎండీటీ దరావత్ సరిత 984/1000, ప్రథమ సంవత్సరంలో బైపిసి జనగాం శ్రీకర్ 431/440, హెచ్‌ఈసీ అమతుల్ రకుల్ షరియా 465/500 మార్కులు సాధించడంతో ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య, మున్సిపల్ కౌన్సిలర్లు కొనతం రాజేష్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, లెక్చరర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇంటర్‌లో ప్రతిభ చూపిన ప్రభుత్వ విద్యార్థులకు శుభాకాంక్షలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News