Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:49 PM

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగేందుకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్

24-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఫిబ్రవరి 25 నుండి మార్చి 18 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా మరియు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగనున్న నేపథ్యంలో, ప్రతి పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. పరీక్షా కేంద్రాల నుండి 100 మీటర్ల పరిధిలోని జిరాక్స్ సెంటర్లు పరీక్ష సమయాల్లో తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి.అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్ (సెక్షన్ 144) అమలులో ఉంటుందని, కేంద్రాల సమీపంలో గుంపులుగా తిరగడం, అనవసరంగా నిలుచోవడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.ఎగ్జామ్ చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఇతర ఎవరూ కూడా పరీక్షా కేంద్రంలో సెల్‌ఫోన్ వినియోగించరాదని, కేంద్రాల లోపల ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబోవడం లేదని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్పీ గారు, తమ తమ పరిధిలోని ప్రతి పరీక్షా కేంద్రాన్ని ముందస్తుగా సందర్శించి అక్కడి భద్రతా ఏర్పాట్లు, త్రాగునీరు, విద్యుత్, ఇతర కనీస వసతులు సమృద్ధిగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు.ప్రశ్నాపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ల నుండి పరీక్షా కేంద్రాలకు భద్రంగా తరలించడం, పరీక్షలు ముగిసిన అనంతరం వాటిని పోస్టాఫీసులకు పంపించే వరకు పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని తెలిపారు. సిబ్బంది అందరూ ఎగ్జామ్ సూపరింటెండెంట్ సూచనల మేరకు కట్టుదిట్టంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా ప్రశాంతంగా సహకరించాలని, పరీక్షా కేంద్రాల వద్ద నియమాలు పాటించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది.ఇంటర్మీడియట్ పరీక్షలు సజావుగా, శాంతియుత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎస్పీ తెలిపారు.

Sthanikam

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగేందుకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ పరితోష్ పంకజ్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News