Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

ఇసుక సరఫరా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

24-03-2026 65 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో ఇసుక సరఫరాను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులకు సూచించారు.

మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్, ఎస్పీ అక్షాంక్ష్ యాదవ్‌తో కలిసి ఇసుక సరఫరా, వినియోగం, నిల్వలు, రవాణాపై సాండ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి, మైనింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అవసరాలు, ప్రభుత్వ పనుల కోసం అవసరమైన ఇసుకను పూర్తిగా ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించడంతో పాటు అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని సూచించారు.

ప్రజలకు పారదర్శకంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇసుక నిర్వహణలో మరింత సమర్థత సాధించాలని తెలిపారు.

ఈ సమావేశంలో ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ మైనింగ్ రవికుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రవీందర్, జిల్లా రవాణా అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఇసుక సరఫరా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అక్రమ రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News