Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:37 AM

ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

27-03-2026 512 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఇస్కిల్ల గ్రామంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామమంతా భక్తి పరవశంతో నిండిపోగా, స్వామివారికి ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి.

స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ఈ మహోత్సవంలో గ్రామ సర్పంచ్ పైళ్ల చందన వెంకటరెడ్డి అన్నప్రసాద వితరణ చేపట్టి భక్తుల ప్రశంసలు అందుకున్నారు. భక్తులకు స్వయంగా సేవలు అందిస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, ఉపేంద్ర చారి, మాధవరెడ్డి, సత్యనారాయణ, సంజీవ, అశోక్ రెడ్డి, శశ్వంత్ రెడ్డి, నర్సిరెడ్డి, రాపర్తి రవి, సాయికుమార్, పరశురాములు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఇస్కిల్లలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News