Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య

09-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది.

గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. భర్త ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో త్వరలో మరణిస్తాడని భావించిన ప్రశాంతి, గత జూలై నెలలో అతని పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.

అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో డబ్బులు త్వరగా పొందాలనే ఉద్దేశంతో ప్రశాంతి పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, తన బావమరిది శ్రీనివాస్ సహాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు వెల్లడైంది.

రవి మృతిపై అనుమానం కలిగిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి ప్రశాంతి, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.

Sthanikam

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేసిన భార్య

Article Image

ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది.

గాంధీనగర్‌కు చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులకు సుమారు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. భర్త ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో త్వరలో మరణిస్తాడని భావించిన ప్రశాంతి, గత జూలై నెలలో అతని పేరుతో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించింది.

అయితే నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో డబ్బులు త్వరగా పొందాలనే ఉద్దేశంతో ప్రశాంతి పన్నాగం పన్నినట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 2న రవికి మద్యం తాగించి, తన బావమరిది శ్రీనివాస్ సహాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు వెల్లడైంది.

రవి మృతిపై అనుమానం కలిగిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి ప్రశాంతి, శ్రీనివాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన ఖమ్మం పట్టణంలో తీవ్ర సంచలనం రేపింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News