Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:39 AM

ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ దే

ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ దే

ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత కాంగ్రెస్ దే
February 10, 2026 03:27 AM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఈసారి కూడా గెలుపు ఖాయం

ప్రచారంలో కోరం కనకయ్య, మువ్వా విజయబాబు, మేకల మల్లిబాబు యాదవ్

ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీదేనని, గతంలో ఎన్నో పార్టీలు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, మాజీ జెడ్పిటిసి, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ స్పష్టం చేశారు.

సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో, ఇల్లందు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా భారీ ప్రచారం నిర్వహించారు. డప్పుల మోతలు, కోలాట నృత్యాలతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ, ఓటర్లను ఆకర్షిస్తూ వార్డుల గుండా ప్రచారం సాగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేసిందని తెలిపారు. ఏప్రిల్ నెల నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, ఈ బడ్జెట్లో పెన్షన్ల పెంపు, రైతుబంధు వంటి పథకాలు అమలవుతాయని చెప్పారు.

రాష్ట్ర మంత్రి పొంగులేటి శీనన్నతో వ్యక్తిగతంగా మాట్లాడి, ఇల్లందు మున్సిపాలిటీకి మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు, అభివృద్ధి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టిందని, ఇల్లందు అభివృద్ధిని విస్మరించి, ఆ పార్టీ నాయకులు మాత్రమే అభివృద్ధి చెందారని తీవ్రంగా విమర్శించారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా, సొంత లాభాలకే పరిమితమైన బిఆర్ఎస్ నాయకులను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. కారు మూడు ముక్కలయ్యే పరిస్థితి వచ్చిందని, వారి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో 11, 12, 13వ వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు రంప రమ్య, మడుగు సాయి సుధా, వెంకటలక్ష్మితో పాటు జిల్లా కాంగ్రెస్ నాయకులు షేక్ పతే మహమ్మద్, ధనియాకుల హనుమంతరావు, రామ్ రెడ్డి, జగన్నాథ్ రెడ్డి, తోటకూరి శివయ్య, గింజల నర్సిరెడ్డి, గుజ్జర్లపూడి రాంబాబు, నల్లమోతు లక్ష్మయ్య, దమ్మాలపాటి సత్యం, శంకువార్ మోహన్, ఫ్రాన్సిస్, శంకువార్ రాజు, బంటు ఐలయ్య, బాల ప్రసాదు, ఎర్రం కుమార్, కోపెల్ల రవి, గంగరాజు, నన్నెబోయిన రవి, మద్ది జంపయ్య, మడుగు సాంబ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరై ప్రచారాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News