Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:12 PM

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం
13-01-2026 885 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ:రాయికోడ్ మండలం ఇందూర్ గ్రామానికి చెందిన లలిత (వయస్సు 45) అనారోగ్య కారణంగా భర్త మాణిక్యం మూడు సంవత్సరాల క్రితం మృతి చెందడంతో, తన కుమారులు నాగారం బాల్ రాజు (వయస్సు 25), నాగారం రజనీకాంత్, నాగారం రాజేశ్‌లతో కలిసి నివసిస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ కుటుంబం యస్.సి (మాదిగ) కులానికి చెందినది కాగా, వృత్తిగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది.తేదీ 08.01.2026 (గురువారం) నాడు ఉదయం 8.00 గంటలకు నాగారం బాల్ రాజు తన ఇంటి నుంచి పొలానికి వెళ్లి సాయంత్రం 6.00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి వచ్చిన సమయంలో అతని తల్లి లలిత ఇంటివద్ద కనిపించలేదు. ఆ సమయంలో ఇంటిలో తమ్ముడు రాజేశ్ మాత్రమే ఉన్నాడు.తల్లి గురించి విచారించగా, రాజేశ్ తెలిపిన వివరాల ప్రకారం అతను ఉదయం 9.00 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి మధ్యాహ్నం 2.00 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి ఇంటివద్ద లేకపోయిందని చెప్పాడు.ఇంకా విచారణ చేయగా, ఇంటి పక్కన నివసిస్తున్న మునిపల్లి రాణమ్మ తెలిపిన వివరాల ప్రకారం, లలిత ఉదయం సుమారు 10.00 గంటల సమయంలో ఇంటి నుంచి నడుచుకుంటూ కర్చల్ గ్రామం వైపు వెళ్లినట్లు తెలిసింది. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Sthanikam

ఇందూర్ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యం

Article Image

మీ స్పందన? 4 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News