Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:59 AM

ఇందిరమ్మ రాజ్యం పేదల ఇల్లు కూల్చడమేనా..?

28-02-2026 72 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వెలుగుమట్ల భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి – అదే స్థలంలో ఇళ్లు నిర్మించాలి

తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఖమ్మం పట్టణంలోని వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన భూమిలో నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు ఆందోళన చేపట్టారు. ముందస్తు హెచ్చరికలు, నోటీసులు ఇవ్వకుండా ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున యంత్రాలతో ఇళ్లను నేలమట్టం చేశారని ఆరోపించారు.ఈ ఘటనకు నిరసనగా తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ మాట్లాడుతూ పేద ప్రజలను బలవంతంగా స్థలాల నుంచి వెళ్లగొట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించి ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు, అదే స్థలంలో రెండు పడకగదుల ఇళ్లు నిర్మించాలని కోరారు.

పేదలపై దుర్మార్గంగా చర్యలు తీసుకోవడం ఆప్రజాస్వామికమని, నిర్వాసితులకు న్యాయం చేయకపోతే దశలవారీగా ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలేపొంగు నాగయ్య, వీరాస్వామి, నగేష్, బింగి శ్రీను, రామకృష్ణ, సుధా, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ రాజ్యం పేదల ఇల్లు కూల్చడమేనా..?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News