Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

ఇందిరమ్మ ఇంటి భూమి పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

13-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో నివసించే మూఢ రాజు కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కలిగి సుఖసంతోషాలతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు.అనంతరం యువనేత సాగర్ షేట్కార్ కూడా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తిచేసుకుని సంతోషంగా నివసించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బాణపురం రాజు, షారుఖ్, గోపాల్ రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు నెహ్రు నాయక్, నర్సింలు, శాతం దత్తు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇంటి భూమి పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో నివసించే మూఢ రాజు కుటుంబానికి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నారాయణఖేడ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్ ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు సొంత ఇల్లు కలిగి సుఖసంతోషాలతో జీవించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారని తెలిపారు.అనంతరం యువనేత సాగర్ షేట్కార్ కూడా కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తిచేసుకుని సంతోషంగా నివసించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బాణపురం రాజు, షారుఖ్, గోపాల్ రెడ్డి, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు సాయిలు పటేల్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు నెహ్రు నాయక్, నర్సింలు, శాతం దత్తు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News