Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:59 AM

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం
12-04-2026 250 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అర్హులందరికీ దశలవారీగా ఇళ్ల మంజూరు: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

పేదలకు సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఛివ్వేంల మండలంలోని గుంజలూరు గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్‌తో కలిసి లబ్ధిదారులు మొలుగురి ప్రభావతి, ప్రభాకర్‌ల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇండ్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేరుతో పేదలను పదేళ్లు ఊరించిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మంజూరు చేసిందని గుర్తుచేశారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఇళ్లను మంజూరు చేస్తూ ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చుతామని తెలిపారు.

“ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం” అని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో మరింత మంది పేదలకు ఇళ్లు అందజేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో గుంజలూరు సర్పంచ్ బొల్లికొండ సైదులు, ఉప సర్పంచ్ దొనకొండ పావని మహేష్, వార్డ్ సభ్యులు కొప్పు సైదులు, కొనకంచి మల్లయ్య, పెదపోలు చందన, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ అమరారపు శ్రీనివాస్, పిసిసి ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమళ్ల రమేష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్, మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు యండి అంజాద్ అలి, మున్సిపల్ కౌన్సిలర్ కొండపల్లి దిలీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News