Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:56 PM

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా: సంజీవరెడ్డి

04-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాగల్‌గిద్దా మండల పరిధిలోని మావినెల్లి గ్రామంలో గ్రామానికి చెందిన రహిమ కుటుంబానికి మంజూరైన నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించగా, నారాయణఖేడ్ శాసనసభ్యుడు డాక్టర్ పి సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉండి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి అర్హుడికి గృహ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. నూతన గృహంలోకి ప్రవేశించిన రహిమ కుటుంబ సభ్యులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివకుమార్, మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్, మనోహర్ పాటిల్, మాజీ సర్పంచ్ బస్వరాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా: సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News