Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:58 PM

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

30-04-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల పురోగతిపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ప్రతి అర్హుడికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News