Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:09 PM

ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళల్లో ఆనందం.. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : కౌన్సిలర్ పులిమామిడి మమత

01-06-2026 157 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీఎంఆర్ గణేష్ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో మార్కండేయ స్లం సమైఖ్యకు చెందిన ద్వాక్రా సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పులిమామిడి మమత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళకు కొత్త వస్త్రాలను అందించడం అభినందనీయమైన కార్యక్రమమని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న చీరలు నాణ్యతతో పాటు ఆకర్షణీయమైన డిజైన్లతో ఉండటం సంతోషకరమని, మహిళలు ఆనందంగా ధరించే విధంగా వాటిని రూపొందించినందుకు ముఖ్యమంత్రికి వార్డు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత వినూత్న ఆలోచనలతో మహిళలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కోరారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ, 12వ వార్డు ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్.పి. రుమాండ్ల శారద, ఎస్‌హెచ్‌జి (ఓబీ) మాలె అనిత, ద్వాక్రా మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరమ్మ చీరలు అందుకున్న మహిళలు తెలంగాణ ప్రభుత్వానికి మరియు కౌన్సిలర్ పులిమామిడి మమతకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Sthanikam

ఇందిరమ్మ చీరల పంపిణీతో మహిళల్లో ఆనందం.. సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది : కౌన్సిలర్ పులిమామిడి మమత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News