Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:08 AM

హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

05-05-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తూ అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించనున్న చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను సంగారెడ్డిలోని తన నివాసంలో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా, ఐటీ హబ్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నగర అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతోందన్నారు. మెడికల్ టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, మిడిల్ ఈస్ట్, యూరప్, ఆఫ్రికా తదితర దేశాల నుంచి అనేక మంది వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు వస్తున్నారని తెలిపారు. ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు హైదరాబాద్ వేదికగా నిలవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, దేశంలోనే అతిపెద్ద ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం గర్వకారణమన్నారు. సినిమా, ఓటిటి, యూట్యూబ్, సామాజిక మాధ్యమాల్లో ప్రభావం చూపే ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారని చెప్పారు. ఈ ఫెస్టివల్‌లో 43 దేశాల నుంచి ప్రతినిధులు, దేశంలోని 8 రాష్ట్రాల నుంచి ఫిల్మ్ మేకర్స్ హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచుతాయని మంత్రి పేర్కొంటూ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Sthanikam

హైదరాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News