Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గట్టుప్పల్ ​మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీశైలం గౌడ్ నియామకం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 03:56 PM

హుజుర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీ ప్రారంభానికి సిద్ధం

హుజుర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీ ప్రారంభానికి సిద్ధం

హుజుర్నగర్‌లో 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీ ప్రారంభానికి సిద్ధం
March 10, 2026 06:43 PM 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఈ నెల రెండవ వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం : జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద నూరిపది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న రెండు వేల ఒక వంద అరవై ఇందిరమ్మ ఇళ్ల మోడల్ కాలనీని ఈ నెల రెండవ వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.మంగళవారం హుజుర్నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న మోడల్ కాలనీని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల బ్లాకులు, అంతర్గత రహదారులు, సభాస్థలి, మొక్కల నాటకం, వాహనాల నిల్వ స్థలం తదితర పనులను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అర్హత లేని వారి పేర్లు జాబితాలో ఉండకూడదని, నిజమైన అర్హులైన వారికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి దరఖాస్తును సూక్ష్మంగా పరిశీలించి ఎటువంటి అవకతవకలకు తావు లేకుండా ఈ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు అధికారి సిద్ధార్థ, ఉద్యాన శాఖ ప్రాజెక్టు అధికారి నాగయ్య, రెవెన్యూ విభాగాధికారి శ్రీనివాసులు, మిషన్ భగీరథ కార్యనిర్వాహక ఇంజినీరు కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News