Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 07:22 AM

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి
27-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునేలా కృషి చేయాలని మాత బ్రహ్మనందా మాయి ట్రస్ట్ అధినేత శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మనందా మాయి అన్నారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో న్యాల్కల్ మండలం బీజేపీ మాజీ మండల అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పరస్పరం ఆధ్యాత్మిక విషయాలపై చర్చించారు. మాత బ్రహ్మనందా మాయి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉండాలని, నిత్యం పూజలు చేయడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుందని పేర్కొన్నారు. హిందూ ధర్మం మన సంస్కృతి, సంప్రదాయాలకు పునాది వంటిదని, ధర్మాచరణతో మనుషుల్లో సత్సంకల్పాలు పెంపొందుతాయని తెలిపారు. ముఖ్యంగా యువత ధర్మం పట్ల ఆసక్తి పెంచుకొని సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. సమాజంలో శాంతి, సౌహార్దం నెలకొనాలంటే ధార్మిక విలువలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డా. జనార్దన్ రెడ్డి, నర్సప్ప, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

హిందూ ధర్మంపై అవగాహన పెంపొందించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News