హెవీ ట్రాక్,బస్,క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
హెవీ ట్రాక్,బస్,క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం
Sthanikam District Staff Reporter
సేవ్ డ్రైవ్ ...సేవ్ అలైవ్ మీ అప్రమత్తతే మీ కుటుంబానికి రక్షణ..!
యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక బైపాస్ న్యూ వివేరా హోటల్ వద్ద ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో హెవీ ట్రాక్,బస్,క్యాబ్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నేటి యాంత్రిక జీవనంలో వేగం వినోదాన్ని ఇస్తుండ వచ్చు,కానీ అదే వేగం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోందని కాసేపు ఆలస్యమైనా పర్వాలేదు,క్షేమంగా ఇంటికి చేరడం ముఖ్యం" అనే విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని సేవ్ డ్రైవ్...సేవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు పట్టణ క్యాబ్, హెవీ ట్రాక్,బస్ డ్రైవర్లకు పట్టణ ట్రాఫిక్ పోలీస్ వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అవినాష్ యాదవ్ మాట్లాడుతూ...రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 70 శాతం మంది యువతే ఉండటం ఆందోళనకరమని
అతి వేగం నిర్ణీత వేగ పరిమితిని మించి వాహనం నడపడం,మద్యం సేవించి డ్రైవింగ్ మెదడుపై నియంత్రణ కోల్పోయి ప్రమాదాలకు నివారించాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అదేవిధంగా టూ వీలర్ ఫోర్ వీలర్ వాహనదారులు హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించక పోవడం చిన్న ప్రమాదం జరిగినా తలకు దెబ్బ తగలడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తోందని గుర్తు చేశారు. పరధ్యానం (సెల్ ఫోన్ వాడకం) డ్రైవింగ్ చేస్తూ..ఫోన్ మాట్లాడటం లేదా మెసేజ్ చేయడం వల్ల దృష్టి మళ్లుతోందని దీంతో ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ క్రింది నియమాలను పాటిస్తే "డ్రైవ్ సేఫ్ - సేవ్ లైఫ్" అనే లక్ష్యం నెరవేరుతుందని అన్నారు.హెల్మెట్ తప్పనిసరి ద్విచక్ర వాహనదారులు ఐఎస్‌ఐ (ఐ.ఎస్.ఐ) ముద్ర ఉన్న హెల్మెట్లను ధరించాలని వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించడం శ్రేయస్కరం తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగడం,జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు దారి ఇవ్వడం బాధ్యతగా భావించాలని వాహన కండిషన్ టైర్లు,బ్రేకులు మరియు లైట్లు సక్రమంగా ఉన్నాయో లేదో క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని బాధ్యతగా గుర్తుంచుకోవాలని అన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదు, అది ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత గుర్తించాలని కోరారు. మీరు క్షేమంగా ఇంటికి వస్తారని మీ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు ఎదురుచూస్తుంటారని గుర్తుంచుకోవాలని మీ ప్రాణం మీ చేతుల్లోనే ఉందని యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రమాదరహిత జిల్లాగా మార్చాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆకాంక్ష యాదవ్,డి.ఎస్.పి ప్రభాకర్ రెడ్డి, సీఐలు,మధుసూదన్, కృష్ణ,రమేష్,చంద్ర బాబు,ఆర్ఐ. వెంకటేశ్వర్లు,ఎస్ఐలు, లక్ష్మణ్,దేవేందర్,ఏఎస్ఐ కేశవరెడ్డి మరియు ట్రాఫిక్ సిబ్బంది టౌన్ ఎస్ఐ.లక్ష్మయ్య,పోలీస్ సిబ్బంది,క్యాబ్ డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు తాజ్ భాయ్,భాస్కర్,నర్సిరెడ్డి,నారాయణ,పల్లెపాటి వెంకటేష్,యాదగిరి,రవి,ముఖేష్,జానకిరామ్,సోమయ్య సురేష్,శ్రీనివాస్,బబ్లు, రాము తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి