Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:11 PM

హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు ప్రధాన కవచం

18-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోలీసులకు 350 హెల్మెట్లు అందజేసిన రావుల మల్లేష్

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్‌ప్రైజెస్ ఎండీ రావుల మల్లేష్ సుమారు రూ.2.50 లక్షల విలువ గల 350 హెల్మెట్లను జిల్లా పోలీసులకు అందజేశారు. రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ఈ హెల్మెట్లు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు.

ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా తలకు గాయాలు కారణంగా ప్రాణనష్టం జరుగుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్‌ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు.

అడిగిన వెంటనే సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి హెల్మెట్లు అందజేసిన రావుల మల్లేష్‌ను ఎస్పీ అభినందించి శాలువాతో సన్మానించారు. సమాజంలో భద్రతా చర్యలకు సహకరించే సంస్థలు, వ్యక్తులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీస్ శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ కోరారు.

Sthanikam

హెల్మెట్ తప్పనిసరి – ప్రాణ రక్షణకు ప్రధాన కవచం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News