Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

26-03-2026 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ట్యాంకర్ నీళ్లతో స్నానాలు.. అధికారులపై ఆగ్రహం

నల్గొండ: మహాత్మాగాంధీ యూనివర్సిటీలో హాస్టళ్లలో నెల రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు లేకపోవడంతో ట్యాంకర్ నీళ్లతో బయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

పలుమార్లు యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో నీటి కొరత కారణంగా నెల రోజులుగా స్నానాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం తెల్లవారుజామున విద్యార్థులు హాస్టల్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో స్పందించిన అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించారు. అయితే గదుల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బయటే స్నానాలు చేయాల్సి వచ్చింది.

యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తమ అవసరాలను పక్కనపెట్టి నిర్మాణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే శాశ్వత పరిష్కారం చూపించాలని, లేనిపక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

Sthanikam

హాస్టళ్లలో నీటి సంక్షోభం.. విద్యార్థుల ఆందోళన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News