Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:03 AM

హామీలు మరిచిన ప్రభుత్వం… రైతులకు న్యాయం ఎక్కడ?: లింగయ్య

20-03-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కరెంట్ కోతలు, యూరియా కొరత

నకిరేకల్‌లో మాఫియా రాజ్యం… కాంగ్రెస్‌పై మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఆరోపణలు

నల్లగొండ జిల్లా: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యంలో పాత రోజులు మళ్లీ కనిపిస్తున్నాయి. అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి, ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు” అని ఆరోపించారు.

“ఉగాది పచ్చడిలా ఆరు గ్యారెంటీలు అంటూ ప్రజలను ఊరించి కాలయాపన చేస్తున్నారు. కొత్త పథకాలు తీసుకురాలేక, ఉన్నవాటినే నిలిపివేస్తున్నారు” అని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై స్పందిస్తూ.. “24 గంటల కరెంట్‌కు స్వస్తి చెప్పి, 12 గంటలకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతోంది” అని పేర్కొన్నారు.

రైతుల సమస్యలపై మాట్లాడిన ఆయన.. “పంట వేసిన దగ్గర నుంచి కొనుగోలు వరకు రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కల్తీ ధాన్యం, కరెంట్ కోతలు, యూరియా కొరత, కనీస మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు” అని అన్నారు.

నకిరేకల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అధికారులు వింత పోకడలు పోతున్నారని ఆరోపించారు. “ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కాంగ్రెస్ నాయకులకు లాభాలు చేకూర్చే ప్రయత్నం జరుగుతోంది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు ఐకేపీ కేంద్రాలను కేటాయిస్తున్నారు” అని తెలిపారు.

అలాగే నియోజకవర్గంలో మైనింగ్, మట్టి, ఇసుక మాఫియాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. జిల్లా మంత్రులు, కలెక్టర్ వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Sthanikam

హామీలు మరిచిన ప్రభుత్వం… రైతులకు న్యాయం ఎక్కడ?: లింగయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News