Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:55 PM

హమాలి కార్మికుల సేవలు అమూల్యం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

01-05-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేటలోని స్థానిక పౌరసరఫరాల గోదాం వద్ద బీఆర్‌టీయూ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సంపదను సృష్టించేది కార్మికుల శ్రమేనని, వారి త్యాగాలు అమూల్యమని పేర్కొన్నారు. కార్మికులు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి బలంగా నిలుస్తున్నారని అన్నారు. అనంతరం బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే బాబు మియా మాట్లాడుతూ మేడే కార్మికుల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన చారిత్రక దినమని, కార్మికుల పోరాటాల ఫలితంగానే నేటి హక్కులు, 8 గంటల పని విధానం సాధ్యమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

హమాలి కార్మికుల సేవలు అమూల్యం: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

Article Image

సదాశివపేటలోని స్థానిక పౌరసరఫరాల గోదాం వద్ద బీఆర్‌టీయూ అనుబంధ సివిల్ సప్లై హమాలి యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ దేశ సంపదను సృష్టించేది కార్మికుల శ్రమేనని, వారి త్యాగాలు అమూల్యమని పేర్కొన్నారు. కార్మికులు ఉత్పత్తి రంగంలో కీలక పాత్ర పోషిస్తూ దేశాభివృద్ధికి బలంగా నిలుస్తున్నారని అన్నారు. అనంతరం బీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే బాబు మియా మాట్లాడుతూ మేడే కార్మికుల హక్కుల సాధనకు ప్రతీకగా నిలిచిన చారిత్రక దినమని, కార్మికుల పోరాటాల ఫలితంగానే నేటి హక్కులు, 8 గంటల పని విధానం సాధ్యమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, హమాలి కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News