Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 06:23 AM

హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు

03-03-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలంలోని బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ఈనెల 27న ప్రారంభమైన పాదయాత్ర పల్లకీసేవ సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకుంది. ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో మార్చి 5న నిర్వహించనున్న 47వ వార్షిక అమరతిథి కార్యక్రమాల సందర్భంగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బెల్లాపూర్ ఆశ్రమం నుంచి బయలుదేరిన పాదయాత్రికులు నారాయణఖేడ్, లింగంపల్లి, మహబత్పూర్ తదితర గ్రామాల్లో రాత్రివేళ బసచేస్తూ భజనలతో, కీర్తనలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు నిండుకుండలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు సమర్పించారు. తదుపరి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి చేరుకుని ప్రత్యేక పూజలు, కీర్తనలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో పాదయాత్రికులు మరియు ఆశ్రమానికి చేరుకున్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి భావాలను పెంపొందిస్తూ గ్రామీణ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

Sthanikam

హద్నూర్ చేరిన పాదయాత్ర పల్లకీసేవ – దత్తగిరి ఆశ్రమంలో భజనలు, పూజలు, కీర్తనలు

Article Image

న్యాల్కల్: నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనూర్ మండలంలోని బెల్లాపూర్ ఆశ్రమం నుంచి ఈనెల 27న ప్రారంభమైన పాదయాత్ర పల్లకీసేవ సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకుంది. ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమంలో మార్చి 5న నిర్వహించనున్న 47వ వార్షిక అమరతిథి కార్యక్రమాల సందర్భంగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. బెల్లాపూర్ ఆశ్రమం నుంచి బయలుదేరిన పాదయాత్రికులు నారాయణఖేడ్, లింగంపల్లి, మహబత్పూర్ తదితర గ్రామాల్లో రాత్రివేళ బసచేస్తూ భజనలతో, కీర్తనలతో భక్తి వాతావరణాన్ని నెలకొల్పారు. సోమవారం హద్నూర్ గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు నిండుకుండలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, హారతులు సమర్పించారు. తదుపరి భక్తులు భజనలు చేస్తూ గ్రామంలోని దత్తగిరి ఆశ్రమానికి చేరుకుని ప్రత్యేక పూజలు, కీర్తనలు, ప్రవచన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థుల సహకారంతో పాదయాత్రికులు మరియు ఆశ్రమానికి చేరుకున్న భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి భావాలను పెంపొందిస్తూ గ్రామీణ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News