సంక్రాంతి రద్దీపై అన్ని శాఖలు అప్రమత్తం మంత్రి కోమటిరెడ్డి.
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశముండటంతో అన్ని శాఖలను అప్రమత్తం చేశామని ఆయన పేర్కొన్నారు.
చిట్యాల లొ నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ట్రాఫిక్ పోలీస్, రవాణా శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. హైవేపై ఎక్కడా వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రమాద నివారణకు అదనపు సిబ్బందిని మోహరించామని వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి