Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక

17-03-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో గుట్ట పోరంబోకు భూముల విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో కొందరు ఎకరానికి రూ.10,000 చొప్పున వసూలు చేసి, ఆ మొత్తాన్ని పట్టాల ఖర్చులకు లేదా విద్యా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై విషయాన్ని పరిశీలించారు.

ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టి కి వెళ్ళగా మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ వసూళ్లు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. భూముల విషయంలో ప్రజలను మోసం చేయడం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే, వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమాలకు లొంగకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

గుట్ట భూముల వివాదంపై సూరేపల్లిలో సమావేశం – తప్పిదాలకు కఠిన చర్యలు: మంత్రి హెచ్చరిక

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సూరేపల్లి గ్రామంలో గుట్ట పోరంబోకు భూముల విషయంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం గ్రామంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా గ్రామంలో కొందరు ఎకరానికి రూ.10,000 చొప్పున వసూలు చేసి, ఆ మొత్తాన్ని పట్టాల ఖర్చులకు లేదా విద్యా కార్యక్రమాలకు వినియోగించాలని చెప్పినట్టు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై గ్రామస్థుల నుంచి ఫిర్యాదులు అందడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమై విషయాన్ని పరిశీలించారు.

ఈ విషయం మంత్రి పార్థసారధి దృష్టి కి వెళ్ళగా మంత్రి మాట్లాడుతూ, ఇలాంటి అక్రమ వసూళ్లు ఎక్కడ జరిగినా ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. భూముల విషయంలో ప్రజలను మోసం చేయడం, అక్రమంగా డబ్బులు వసూలు చేయడం తీవ్రమైన తప్పిదమని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే, వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి అక్రమాలకు లొంగకుండా వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ఈ సమావేశంలో సంబంధిత అధికారులు, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News