Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:03 AM

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

20-02-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

క్రమం తప్పని తనిఖీలు, నోడల్ అధికారుల నియామకం – నెలనెలా నివేదికలు తప్పనిసరి

హైదరాబాద్: గురుకుల విద్యార్థుల సంక్షేమంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గురుకుల విద్యాసంస్థల్లో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోడల్ అధికారుల నియామకానికి ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర విచారణ కాలపట్టికను సిద్ధం చేయాలని సూచించింది. జిల్లా వారీగా రూపొందించిన షెడ్యూల్ ప్రకారం తనిఖీలు చేపట్టాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆకస్మిక సందర్శనలతో పాటు పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తనిఖీ నివేదికలను వెంటనే సంబంధిత విభాగానికి సమర్పించాలని ఆదేశించింది. అధికారులు తీసుకున్న చర్యల వివరాలను తక్షణమే తెలియజేయాలని హుకుం జారీ చేసింది. ప్రతి నెలా ఐదవ తేదీలోపు తనిఖీ నివేదిక సమర్పణను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో విద్యార్థులకు మెరుగైన వసతి, భోజనం, విద్యా సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Sthanikam

గురుకుల విద్యార్థుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News