Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:00 AM

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

14-04-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దళారులను నమ్మి పంట అమ్మవద్దు: కొప్పుల వేణారెడ్డి

చివ్వెంల: మండలంలోని గుంపుల తిరుమలగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు. హకా ఐకేపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలను ఆయన ప్రారంభించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన పంటను దళారులను నమ్మి అమ్మవద్దని సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకొని న్యాయమైన ధర పొందాలని కోరారు.ధాన్యంలో తేమ శాతం 17కి మించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ధాన్యాన్ని బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాగయ్య, ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, మార్కెట్ డైరెక్టర్ నర్సింహ చారి, అబ్దుల్ కరీం, పట్టణ ఉపాధ్యక్షుడు బైరు నాగరాజు, జిల్లా నాయకులు ఎలుగురి వీరయ్య గౌడ్, పందిరి మల్లేష్ గౌడ్, గార్లపాటి వెంకటరెడ్డి, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంపుల తిరుమలగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News