Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:57 AM

గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

11-04-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రైతులకు మద్దతుగా ప్రోత్సాహకాలు – కొప్పుల వేణారెడ్డి

చివ్వెంల మండలం: మండలంలోని గుంజలూరు గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్నాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు క్వింటాకు ఐదు వందల రూపాయల ప్రోత్సాహకం అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్, రుణ మాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో పాటు ఈ ప్రోత్సాహకం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు.

తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తూ రైతులకు న్యాయం చేస్తున్నదని పేర్కొన్నారు. రైతుల వద్దే ధాన్యం కొనుగోలు చేసి తిరిగి ప్రజలకు అందించే విధానం అమలు చేస్తున్నామని తెలిపారు.

అందువల్ల రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను అమ్మాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రాల వద్ద కప్పే సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తేమ పదిహేడు శాతం ఉండేలా చూడాలని, బస్తా నలభై ఒక కిలోలకే తూకం వేయాలని, రైతులను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లికొండ సైదులు, ఉప సర్పంచ్ దొనకొండ పావని మహేష్, వార్డ్ సభ్యులు కొప్పు సైదులు, వ్యవసాయ అధికారి మానస, కార్యక్రమ నిర్వహకులు వెంకయ్య, సైదులు, దొనకొండ శ్రీనివాస్, దొనకొండ వీరయ్య, పెద్ది అంజయ్య, అబ్దుల్ కరీం, బైరు శైలేందర్ గౌడ్, బైరు నాగరాజు, వీరబోయిన అశోక్, వీరబోయిన వీరయ్య, బొజ్జ పాపిరెడ్డి, దారోజు కోటయ్య, కొనకంచి కామేష్, మొలుగురి మైసయ్య, పందిరిముత్యాలమ్మ, పెదపోలు వినోద్, మొలుగురి పుల్లయ్య, ఉప్పాల కవిత, మొలుగురి మణెమ్మ, మొలుగురి సంతోష, మహేశ్వరి, మొలుగురి వెంకన్న, బొల్లికొండ శరత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంజలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News