Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విశాల భారతి హైస్కూల్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 05:59 PM

గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత

గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత

గోవా నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సులో 86 గ్రాములు గంజా పట్టివేత
February 27, 2026 08:06 PM 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ మాఫియాపై నిర్వహించిన ప్రత్యేక దాడిలో అత్యంత శక్తివంతమైన హైడ్రోపోనిక్ గంజాను స్వాధీనం చేసుకున్నారు.జిల్లా చరిత్రలో ఈ రకమైన మత్తు పదార్థం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం విశేషం.ప్రొహిబిషన్ & ఎక్సైజ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు మెదక్ ఎక్సైజ్ బృందం ఆపరేషన్ చేపట్టింది. డీసీ జె. హరి కిషన్ పర్యవేక్షణలో, ఏసీ జి. శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె. శ్రీనివాస్ రావు నేతృత్వంలో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు.ఈ రోజు తెల్లవారుజామున మునిపల్లి మండలం కమ్కోల్ టోల్ ప్లాజా వద్ద గోవా నుండి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సును ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు కేరళకు చెందిన బ్రెయిన్ బాబు (వయసు 30) వద్ద 86 గ్రాముల హైడ్రోపోనిక్ గంజా లభ్యమైంది. నిందితుడు వృత్తిరీత్యా ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేస్తూ, పార్టీల కోసం మత్తు పదార్థాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు.హైడ్రోపోనిక్ గంజా ప్రత్యేకత:సాధారణ గంజాయితో భిన్నంగా,మట్టి లేకుండా నీరు, పోషకాల సహాయంతో గదుల్లో ప్రత్యేక పద్ధతిలో పండించబడే ఈ గంజాలో మత్తును కలిగించే THC శాతం ఎక్కువగా ఉంటుంది. స్వాధీనం చేసిన 86 గ్రాముల విలువ సుమారు రూ. 3.5 లక్షలు అని అధికారులు అంచనా వేశారు.అంటే, ఒక్క గ్రాముకు దాదాపు నాలుగు వేల రూపాయలు పైమాటే.ఆపరేషన్‌లో పాల్గొన్న అధికారులు:

సీఐ: బి. గాంధీ నాయక్

ఎస్ఐ: బి. యాదయ్య

హెడ్ కానిస్టేబుల్: ఎం.డి. అలీమ్

కానిస్టేబుళ్లు: అమ్మతుల్ కరీమ్, రామారావు నాయక్, ఎం. గోపాల్, వివేక్, ముజమ్మిల్, వి. కావ్యశ్రీ

నిందితుడిపై నిషేధిత మత్తు పదార్థాల చట్టం 1985 కింద కేసు నమోదు చేసి, ఈ ముఠా వెనుక ఉన్న ఇతర వ్యక్తులపై దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు. విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసిన సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News