Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:58 AM

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ
27-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మూడునెలల నిష్టతో సిద్ధం చేసిన పవిత్ర బియ్యం – సీతారాముల కళ్యాణానికి భక్తి కానుక

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో జరుగుతున్న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తి భావంతో తలంబ్రాల బియ్యాన్ని సమర్పించిన సంఘటన భక్తులను ఆకట్టుకుంది.సూర్యాపేట మండలం బాలేం గ్రామానికి చెందిన శివరాత్రి ముత్యాలు, యాదమ్మ దంపతులు గత మూడు నెలలుగా వడ్లను గోటితో ఒలిచి సిద్ధం చేసిన బియ్యంలో ఒక కిలో 250 గ్రాముల తలంబ్రాల బియ్యాన్ని శుక్రవారం దేవాలయ కమిటీకి అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో నిష్టతో, భక్తిశ్రద్ధలతో తయారు చేసిన ఈ బియ్యాన్ని భద్రాద్రి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరిగే సీతారాముల కళ్యాణానికి, అలాగే బొడ్రాయి బజార్‌లోని శ్రీ వేదాంత భజన మందిరంలో జరిగే కళ్యాణోత్సవానికి కూడా సమర్పించినట్లు తెలిపారు.భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ దంపతులను దేవాలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్షుడు బ్రాహ్మణపల్లి మురళీధర్, కార్యదర్శి పబ్బా ప్రకాశరావు, దేవర శెట్టి సోమయ్య, అర్చకులు బట్టారం వంశీకృష్ణ, దేవాలయ నిర్వహణాధికారి బచ్చు పురుషోత్తం, భక్తులు పొద్దుటూరి నాగ ప్రసాద్, మహంకాళి కవిత, ఓరుగంటి కనక రత్నం, కంచర్ల లీల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోటితో ఒలిచిన తలంబ్రాల బియ్యం సమర్పణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News