Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

గొట్టిపర్తిలో ఓరా హోరీ గా సాగుతున్న కబడ్డీ క్రీడలు

23-03-2026 359 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో ఆదివారం నాడు అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రావు విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, మూడు జిల్లాల స్థాయి కబడ్డీ క్రీడలు నిర్వహించారు. ఈ పోటీలను ప్రారంభిస్తానికి ముఖ్యఅతిథిగా గ్రామంలోని ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని, స్నేహ సంబంధాలు బలపడతాయని అన్నారు, యువకుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలిగి తీయడానికి ఈ క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజాన పెట్టుకొని నిర్వహిస్తున్నఅరుంధతి యూత్ సభ్యులను ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు అభినందించారు. అనంతరం పలు గ్రామాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు. కబడ్డీమొదటగా పనిగిరి ,మోతే ఇరుజట్లు తలపడ్డాయి. నువ్వా నేను అన్నట్టుగా ఉత్కంఠ గా సాగగా గ్రామ ప్రజలు ఎవరు గెలుస్తారు ఊహించని విధంగా ఈ ఇరుజట్లు అంతా ఉత్కట్టంగా తలపడ్డాయి. చివరిగా మోతే కబడ్డీ టీం పై పనిగిరి జట్టు విజయం సాధించింది. అనంతరం అరుంధతి యూత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సింగిల్ డాన్స్, గ్రూప్ డాన్స్, నాటికలు వివిధ గ్రామాల నుంచి వచ్చి తమ ప్రతిభను కనబరిచారు. దీనిని తిలకిస్తానికి గ్రామాల్లోని మహిళలు,యువకులు, గ్రామస్తులు మరియు వివిధ గ్రామాల క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని తిలకించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు , పి ఈ టి లు, అరుంధతి యూత్ యువజన సంఘం సభ్యులు,వివిధ గ్రామాల క్రీడాకారులు, పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తిలో ఓరా హోరీ గా సాగుతున్న కబడ్డీ క్రీడలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News