Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:33 PM

గొట్టిపర్తిలో కబడ్డీ పోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి

23-03-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి,

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని మూడు జిల్లాల స్థాయి కబడ్డీ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు స్నేహ సంబంధాలను బలపరుస్తాయని తెలిపారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.

ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన అరుంధతి యూత్ సభ్యులను ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అభినందించారు.

కబడ్డీ పోటీల్లో పలు గ్రామాల జట్లు పాల్గొన్నాయి. మొదటి మ్యాచ్‌లో పనిగిరి, మోతే జట్లు తలపడగా పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి పనిగిరి జట్టు విజయం సాధించింది.

అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సింగిల్ డాన్స్, గ్రూప్ డాన్స్, నాటికల ద్వారా వివిధ గ్రామాల కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామ మహిళలు, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పీఈటీలు, అరుంధతి యువజన సంఘం సభ్యులు, వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు

Sthanikam

గొట్టిపర్తిలో కబడ్డీ పోటీలు.. సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News