Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:35 PM

గొట్టిపర్తి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కలిసికట్టుగా పనిచేయాలి; సర్పంచ్ మంజుల

03-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా గ్రామంలో గ్రామ సభ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామ వార్డు నెంబర్లు వాళ్ల వార్డులలో నెలకొన్న సమస్యల గురించి గ్రామానికి ముఖ్యఅతిథిగా వచ్చిన గ్రామ స్పెషల్ అధికారికి, సర్పంచుకు తెలియజేశారు. ముఖ్యంగా వార్డులలో సిసి రోడ్లు పనులు, విద్యుత్ స్తంభాలు, మురికి కాలువలు, వీధిలైట్లు, అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, వార్డులలో నెలకొన్నసమస్య ఉందని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. అనంతరం గ్రామాల్లోని పలువురు మాట్లాడగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు రాలేదని, గతంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్లకు రాలేదని అధికారులకు తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి , స్థానిక సర్పంచ్ మంజుల మాట్లాడుతూ... అర్హులైన పేదవారికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. గ్రామంలో పలు వార్డులలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేస్తానని అన్నారు. గొట్టిపర్తి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శవంతంగా తీర్చు దుద్దడానికిరాజకీయల అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించి గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి గ్రామాన్ని అభివృద్ధికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి కలిసికట్టుగా పనిచేయాలి; సర్పంచ్ మంజుల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News