Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో కృష్ణాష్టమి, బోనాల పండుగల తేదీలు ఖరారు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 01:33 PM

గొట్టిపర్తి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా... సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న

13-02-2026 350 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామ పంచాయతీ ఆవరణంలో మొట్టమొదటిసారిగా పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామాల్లో 12 వార్డు సభ్యులు తమ వార్డులో ఉన్న సమస్యలను గ్రామసభ ద్వారా వివరించారు. ముఖ్యంగా వార్డులలో నీటి సమస్య, సిసి రోడ్లు, కరెంటు స్తంభాలు, విది లైట్లు, పలు సమస్యలపై సర్పంచికి తెలిపారు. గ్రామంలో అంగన్వాడి వారి సమస్యలు తెలుపగా అంగన్వాడీలో ఒకటిలో ఆయా గా లేరని, అంగన్వాడి సెంటర్లో కరెంటు సమస్య ఉందని అన్నారు. పాఠశాలలో హెడ్మాస్టర్లు వారి సమస్యలు తెలుపగా పాఠశాలలో వర్షాకాలంలో నడుస్తానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పాఠశాలలో సిసి రోడ్లు ఏర్పాటు చేయాలని, గేటుకు తాళం వేయించాలని, అలాగే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని, పాఠశాలకు విద్యార్థులు రావడంలేదని తెలిపారు. గ్రామస్తులు గ్రామంలోని సమస్యలు తెలుపగా అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారని, సైడు మురికి కాలువలకు శుభ్రం చేయించాలని, ముఖ్యంగా గ్రామాల్లో కోతులు బెడుద ఎక్కువగా ఉందని అన్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న మాట్లాడుతూ... పలు వార్డులలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని అన్నారు, అలాగే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేస్తానని, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సిసి రోడ్లు వేయిస్తానని, అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని అన్నారు. గొట్టిపర్తి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దానని అన్నారు. రాజకీయాల అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, పాలకవర్గ సభ్యులు, సింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లత విజయ్ కుమార్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు, పాఠశాల హెడ్మాస్టర్లు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా... సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News