Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:54 PM

గొప్ప దైవజనులు బిషప్ సి. హెచ్. జయరాజు కి వీడ్కోలు

16-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నార్కట్ పల్లి సి.ఎఫ్.జి. ప్రార్థనా మందిరంలో ఘన అంతిమ సంస్కారాలు – వేలాది మంది నివాళులు

నార్కట్ పల్లి మండల కేంద్రంలోని సి.ఎఫ్.జి. ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు, సీనియర్ పాస్టర్ బిషప్ సి. హెచ్. జయరాజు (62) పరమపదించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని బసవతారకం వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయన మృతి వార్త ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషాదాన్ని నింపింది. మంగళవారం నార్కట్ పల్లిలోని సి.ఎఫ్.జి. ప్రార్థనా మందిరంలో ఆయన భౌతిక దేహానికి వేలాది మంది క్రైస్తవులు పూలమాలలు అర్పించి ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రార్థనలు నిర్వహించి అంతిమ యాత్రను శ్రద్ధగా చేపట్టారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బిషప్ దుర్గం ప్రభాకర్, సూర్యాపేటకు చెందిన చార్లెట్ దాతృత్వ సేవా సంస్థ వ్యవస్థాపకులు బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ, బిషప్ జయరాజు ఆధ్యాత్మిక సేవలో అనేక సంవత్సరాలు గడిపి వేలాది మంది విశ్వాసులను ఆత్మీయ మార్గంలో నడిపించారని తెలిపారు. ఆయనకు భార్య రెచల్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, సమాజంలో సేవాభావంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కన్వీనర్ పాస్టర్ చింత మనిషే, నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ క్రైస్తవ నాయకులు పోకల అశోక్, సీనియర్ నాయకులు మర్రి రాజు , నకిరేకల్ నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు వేముల హనోక్ , బిషప్ వై. సమర్పణ కుమార్ , జాన్సీ రాణి , తుంగతుర్తి నియోజకవర్గ అధ్యక్షులు బాకీ పరంజ్యోతి , చింత సుధాకర్, పాస్టర్ రావుల అమ్రామ్, పాస్టర్ ఏసురత్నం , పాస్టర్ జిల్లా సంసన్, పాస్టర్ జీవప్రకాశ్ బల్లెం, పాస్టర్ నామ మోజెష్, కత్తుల యెహోవా దాసు తదితరులు పాల్గొన్నారు.

బిషప్ సి. హెచ్. జయరాజు ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయమని, ఆయన సేవలను ఎప్పటికీ మరిచిపోలేమని శ్రద్ధాంజలి ఘటించారు.

Sthanikam

గొప్ప దైవజనులు బిషప్ సి. హెచ్. జయరాజు కి వీడ్కోలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News