Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:59 AM

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు

25-02-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కూసుమంచి మండలంలోని గోపాలరావుపేట గ్రామంలో ఉన్న శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో ఈనెల 26 నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణ కర్త, ఏఆర్ ఏఎస్ఐ ఇంటూరి శేఖర్ రావు తెలిపారు.బుధవారం కూసుమంచిలోని పత్రికా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. విశ్వాసనామ సంవత్సరం, పాల్గుణ మాసం దశమి నుంచి ఏకాదశి పునర్వసు నక్షత్రం వరకు రెండు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అర్చకులు రఘునాథచార్యులు, ముడుంబ శ్రీమన్నారాయణ చార్యుల చేత శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటామని చెప్పారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు స్వామివారి ఆశీర్వాద తీర్థప్రసాదాలు అందజేయనున్నట్లు వెల్లడించారు.

ఈ తిరుకల్యాణ మహోత్సవ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని ఆలయ నిర్మాణ కమిటీ కోరింది.

Sthanikam

గోపాలరావుపేటలో నేటి నుంచి తిరుకల్యాణ మహోత్సవాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News