Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:13 PM

గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా సాగాలి

25-01-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్

స్థానికం ప్రతినిధి

గౌడ్ అధికారుల మరియు వృత్తిపరుల సంఘం గోపా సర్వసభ్య సమావేశం శుక్రవారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి సార ప్రభాకర్ గౌడ్ అధ్యక్షత వహించగా, నూతన కార్యవర్గ ఎంపికతో పాటు ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ మాట్లాడుతూ, గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా నిరంతరంగా ప్రవహిస్తూ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబంలో విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉన్నత చదువులు చదివిన వారికి జీవనోపాధి అవకాశాలు కల్పించేందుకు గోపా పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు.గోపా సభ్యులందరికీ నాగోల్ హైదరాబాద్‌లోని సుప్రజా ఆసుపత్రి సహకారంతో ముప్పై శాతం రాయితీతో ఆరోగ్య కార్డు సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో సంఘ భవన నిర్మాణం చేపట్టి గౌడ్ సమాజానికి సంబంధించిన అన్ని అంశాలను ఒకే వేదికపై సమీకరిస్తామని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు చెక్కిళ్ల మధుసూదన్ గౌడ్ మాట్లాడుతూ, సర్టిఫికెట్లలో పేరు చివర గౌడ్ అని లేకపోయినా, పరిచయ సమయంలో పేరు చివర గౌడ్ అని తెలియజేయాలని సూచించారు. దీని ద్వారా వివిధ శాఖల్లో పని చేస్తున్న మనవారి సహకారం పెరుగుతుందని, ఐక్యత మరింత బలపడుతుందని అన్నారు.ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి యల్మకంటి మీరయ్య గౌడ్ కూడా హాజరయ్యారు. జిల్లా సభ్యుల సమక్షంలో నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు.

నూతన కార్యవర్గ సభ్యులు:

ముఖ్య సలహాదారుడు – పూసల లింగా గౌడ్,జిల్లా అధ్యక్షుడు – సార ప్రభాకర్ గౌడ్,ప్రధాన కార్యదర్శి – డాక్టర్ కే రాజు గౌడ్, కోశాధికారి – శంకరి వెంకట్ స్వామి గౌడ్,ఉపాధ్యక్షులు – రాం చందర్ గౌడ్, రాములు గౌడ్,ఆర్గనైజింగ్ కార్యదర్శి – చెన్న గౌడ్,సంయుక్త కార్యదర్శి – విట్టల్ గౌడ్

ఈ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు వెల్లడించారు.

Sthanikam

గోపా నూతన కార్యవర్గం మంజీరా నదిలా సాగాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News