Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:06 PM

గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి

24-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల ప్రజలకు మండల అభివృద్ధి అధికారిణి కీలక సూచనలు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాలు మరియు ఇతర మార్గాల ద్వారా కొత్త పెన్షన్ల దరఖాస్తులకు అవసరమైన పత్రాలపై ఒక సమాచారం విస్తృతంగా ప్రచారమవుతున్న నేపథ్యంలో, గంపలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి (ఎంపిడిఓ) టి.సరస్వతి ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణపై ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదని స్పష్టం చేశారు. అందువల్ల ప్రజలు అసత్య ప్రచారాలను, అపోహలను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం కేవలం “స్పౌస్ పెన్షన్లు” మాత్రమే అమలులో ఉన్నాయని తెలిపారు. అంటే, పెన్షన్ పొందుతున్న భర్త మరణించిన సందర్భంలో ఆ పెన్షన్‌ను భార్యకు మంజూరు చేసే ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని వివరించారు. దీనికి మినహా ఇతర కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైతే, సంబంధిత వివరాలను అధికారికంగా గ్రామ సచివాలయ సిబ్బంది లేదా పంచాయతీ కార్యదర్శుల ద్వారా తెలియజేస్తామని తెలిపారు.

అనవసరంగా మీసేవ కేంద్రాలు లేదా సచివాలయాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడవద్దని, అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

గంపలగూడెం మండల ప్రజలకు ముఖ్య గమనిక ఎంపీడీవో టి.సరస్వతి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News