Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:12 PM

గిరిజనుల ఆధ్యాత్మిక దీప్తి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

26-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, గిరిజన సమాజానికి మార్గదర్శకుడైన సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రావి భద్రాద్రి గార్డెన్ లో వైభవంగా నిర్వహించారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికోత్సాహంతో నిండింది.

ఈ వేడుకలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. గిరిజనుల సమగ్రాభివృద్ధి దిశగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు.

కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ అవైస్ రహమాన్ చిస్తీ, వలిగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య భీమానాయక్, భువనగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ కనుకుంట్ల రేఖా బాబురావ్, భువనగిరి మున్సిపాలిటీ చైర్‌పర్సన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, పోచంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ తాడక వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

అలాగే భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి టి. నాగిరెడ్డి హాజరై గిరిజన సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బానోతు నర్సింహా నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గౌరవ అధ్యక్షులు బానోతు రాములు నాయక్, బుక్క రమేశ్ నాయక్, ముడి వీరు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గిరిజనుల ఆధ్యాత్మిక దీప్తి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News