Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:04 AM

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ

13-04-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కోదాడ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు జిల్లా పరిధిలోని గిడ్డంగులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో మిల్లర్లు అప్పగిస్తున్న బియ్యం నిల్వలను పరిశీలిస్తూ పలు అంశాలను క్షేత్రస్థాయిలో సమీక్షించారు.

తనిఖీల్లో భాగంగా నిల్వలకు సంబంధించిన రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, స్టాకు నమోదులు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. గిడ్డంగిలో ఉన్న స్టాకు రిజిస్టర్, సిబ్బంది రిజిస్టర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా గిడ్డంగిలో పనిచేస్తున్న హమాలీలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరగా, త్వరలోనే ఏర్పాట్లు చేస్తామని నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. హమాలీలకు తాగునీటి సౌకర్యం వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గిడ్డంగుల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిబంధనల ప్రకారం పనులు జరగాలని స్పష్టం చేశారు.

Sthanikam

గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలు.. హమాలీల సమస్యలపై చైర్మన్ హామీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News