Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:47 AM

ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు

ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు
26-04-2026 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవిమాత జయంతి సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది హాజరయ్యారు.

వాసవిమాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ ఆర్యవైశ్య సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మం, అహింస, సమానత్వం వంటి మహోన్నత విలువలను ప్రపంచానికి తెలియజేసిన వాసవీ మాత ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.

వాసవీ మాత చూపించిన సత్యమార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున శ్రీ వాసవీ మాత ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఆర్యవైశ్యులకు రాజకీయంగా రెండు దఫాలు మున్సిపల్ చైర్మన్ పదవులు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో వాసవిమాత ఉత్సవాలను నిర్వహిస్తూ ధర్మం, నీతి, సేవాభావం వంటి విలువలను ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని సూచించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వాసవిమాత జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News