Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ
18-03-2026 112 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో ఈదమ్మ తల్లి పండుగ నిర్వహణపై వచ్చిన వార్తల ప్రభావంతో పండుగ ఏర్పాట్లు మరింత విస్తృతంగా చేపట్టారు. పల్లపు వారి ఆధ్వర్యంలో వడ్డెరల కులదేవత ఈదమ్మ తల్లి పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అష్టోత్తరాలు, అలంకరణలు నిర్వహించి చీర, సారే సమర్పించారు. ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు ఆహ్వానం మేరకు పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు.

పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు భోజన వసతులు కల్పించారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కోనేటి యాదగిరి , పొలాగోని స్వామి , చెరుకు సైదులు తదితరులు పాల్గొన్నారు. పల్లపు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని పండుగను విజయవంతం చేశారు.

Sthanikam

ఘనంగా ఉరుమడ్లలో ఈదమ్మ తల్లి పండుగ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News