Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:01 AM

ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం
25-02-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పేదలందరికీ సొంత గూడు కల్పనలో ప్రభుత్వం కట్టుబడి ఉందని నాయకుల స్పష్టం

తిరుమలాయపాలెం

ప్రతి ఒక్కరికి సొంత గూడు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ గృహాల గృహ ప్రవేశ కార్యక్రమం బుధవారం తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం శ్రీను, జిల్లా నాయకుడు రామసహాయం అరవింద రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పేదలందరికీ కూడు, గూడు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలోనూ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా పార్టీ శ్రేణులు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించిన ప్రభుత్వానికి, తమకు తోడ్పాటు అందించిన నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నందిపాటి మల్లికార్జున, మండల కాంగ్రెస్ నాయకురాలు రామసహాయం హరిత రెడ్డి, ఇతర గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News