Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

గీత కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన నేత ధర్మబిక్షం

26-03-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గీత పనివారల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మబిక్షం 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. గీత పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎర్ర రమేష్ గౌడ్ మాట్లాడుతూ, ధర్మబిక్షం భౌతికంగా దూరమైనా ఆయన ఆశయాలు, సేవలు గీత పనివారల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.

గీత పనివారల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి అపూర్వమని పేర్కొన్నారు. గీత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్లు కల్పించడం, తాటి చెట్ల పెంపకానికి సొసైటీలకు భూముల కేటాయింపు, వృత్తిలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందేలా చేయడం వంటి అంశాలు ఆయన పోరాట ఫలితమని గుర్తుచేశారు. గౌడన్నలను ఏకం చేసి ప్రభుత్వాలతో పోరాడి హక్కులు సాధించారని అన్నారు.

ధర్మబిక్షం కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని, సూర్యాపేట జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గంగాపురం వెంకటయ్య, ఎర్ర వెంకటేశం, బాలగోని మల్లయ్య, బాలగోని నరసింహ, గంగాపురం యాదయ్య, వీరమల్ల వెంకటయ్య, ఎర్ర సత్తయ్య, వీరమల్ల ముత్తయ్య, చెరుకు శివరాజు, పెండెం రవీందర్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Sthanikam

గీత కార్మికుల హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన నేత ధర్మబిక్షం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News