Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:40 AM

గ్యాస్ కొరతపై సిపిఐ ఆందోళన – కేంద్ర నిర్లక్ష్యంపై మండిపాటు

17-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యుద్ధం వద్దు… ప్రపంచ శాంతి వర్ధిల్లాలి – సుభాష్ సెంటర్‌లో ఆందోళన

రామన్నపేట,

జీవనోపాధులను దెబ్బతీస్తున్న గ్యాస్ కొరతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నివారించాలని సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ డిమాండ్ చేశారు.

ఈ మేరకు రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు చేపట్టిన ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా ఊట్కూరి నరసింహ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో దేశానికి అవసరమైన పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలను ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనివల్ల గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.

అమెరికా ఇరాన్‌పై చేస్తున్న దాడులను ఖండిస్తూ యుద్ధం కాకుండా ప్రపంచ శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, మండల సహాయ కార్యదర్శి కళ్ళెం రామచంద్రం, పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, బాలగోని మల్లయ్య, ఊట్కూరి భగవంత, గంగాపురం వెంకటయ్య, వీరమల్ల ముత్తయ్య, గంగాపురం యాదయ్య, పల్లె మల్లేశం, పర్స సుదర్శన్, ఊట్కూరు కృష్ణ, ఊట్కూరు శీను, పెండెం రవీందర్, ఏనూతుల రమేష్, కడమంచి జగన్నాథం, వీసం గాలయ్య, ఊట్కూరు శంకర్, జెల్లా అంబయ్య, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గ్యాస్ కొరతపై సిపిఐ ఆందోళన – కేంద్ర నిర్లక్ష్యంపై మండిపాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News