Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:34 AM

గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు

26-03-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు

గ్యాస్ సిలిండర్లపై ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధికంగా ధరలు వసూలు చేస్తున్నారని గుర్తించిన నేపథ్యంలో, టిఫిన్ సెంటర్ల, హోటల్ యజమానులు దీనిని ఆసరా చేసుకుని టిఫిన్ ధరలను పెంచడం జరిగింది. కృతిమ కొరతను సృష్టించిన గ్యాస్ ఏజెన్సీల వారు గ్యాస్ ను అక్రమంగా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కిసాన్ మోర్చ మాజీ రాష్ట్ర కార్యదర్శి కనగాల నారాయణ, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఆర్‌డీవో కార్యాలయంలో డీటీ సతీష్ కు మెమొరాండం అందజేయడం జరిగింది. ప్రజలకు అవసరమైన గృహ వినియోగ గ్యాస్‌పై అధిక ధరలు వసూలు చేయడం వలన సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాలపై ఈ అదనపు భారం మరింత ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, సంబంధిత గ్యాస్ ఏజెన్సీలపై తగిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే గ్యాస్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని మెమొరాండం ఇచ్చామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నడిగూడెం మండల అధ్యక్షులు వీరబాబు, అనంతగిరి మండల అధ్యక్షులు సతీష్, జిల్లా నాయకులు జల్లా జనార్ధన్, రాష్ట్ర నాయకులు చిట్టయ్య, కృష్ణ ప్రసాద్, దేవరశెట్టి సత్యనారాయణ, విశ్వేశ్వరరావు, భూమా శ్రీనివాస్, సాగర్ల సతీష్, కొండయ్య, సుధాకర్ రెడ్డి, శంకర్, పసి, బిజేపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

Sthanikam

గ్యాస్ బండల రేటు పెరిగిందని టిఫిన్ రేట్లు పెంచిన హోటల్ యజమానులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News