Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హులిగరలో అర్హులైన కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల అందజేత అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 04:10 PM

గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 170 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య హాజరయ్యారు. ముందుగా దేశ స్వాతంత్ర్యం, రాజ్యాంగ రూపకల్పనకు ప్రాణాలు అర్పించిన మహనీయులను స్మరించుకుని వారికి ఘన నివాళులు అర్పించారు.వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించిన మహాగ్రంథమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఆత్మను ప్రతి పౌరుడు కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. యువత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు.గ్రంథాలయాలు విజ్ఞాన సంపదను పెంపొందించే కేంద్రాలుగా పనిచేస్తున్నాయని, విద్యార్థులు, యువకులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News