Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 03:00 AM

గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర బడ్జెట్

20-03-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఉపాధి హామీకి నిధుల లేవు – పింఛన్ల పెంపు ప్రస్తావన లేదు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించిందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామీణ ఉపాధి పనుల అమలుకు అవసరమైన 40 శాతం రాష్ట్ర వాటా నిధులను కేటాయించకపోవడం, పింఛన్ల పెంపు విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టడం వ్యవసాయ కార్మికులను మోసం చేయడమేనని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలకు, కొత్తగా ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లకు ఈ బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఆరు హామీల అమలుపై కూడా ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరాశ కలిగించిందన్నారు.

భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఆర్థిక సహాయం పేరుతో తగిన నిధులు కేటాయించకపోవడం, కౌలు రైతులకు ఇచ్చే సహాయం, మహిళలకు ప్రకటించిన హామీలపై ప్రస్తావన లేకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. రేషన్ కార్డుల విషయంలో కూడా కొత్త లబ్ధిదారులకు అదనపు నిధులు కేటాయించకపోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.భూ నిర్వాసితుల సమస్యలు, పునరావాసంపై కూడా బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ బడ్జెట్ గ్రామీణ పేదలకు న్యాయం చేయలేదని మట్టిపల్లి సైదులు స్పష్టం చేశారు.

Sthanikam

గ్రామీణ పేదలను పూర్తిగా విస్మరించిన రాష్ట్ర బడ్జెట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News